CHRIST LIFE REVIVAL
నా జీవిత సాక్ష్యం — భాగం 25
కుటుంబ జీవితంలో నేర్చుకున్న పాఠం
నా ప్రియమైన కుటుంబమా!
వివాహ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన పరిస్థితులు ఎదురుకావు. ప్రతి కుటుంబానికి కొన్ని బాధ్యతలు, కొన్ని బాధలు, కొన్ని పోరాటాలు, కొన్ని త్యాగాలు ఉంటాయి.
భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి పరిస్థితులను మరొకరు గౌరవించాలి. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం కాకుండా, వాటిని కలిసి ఎదుర్కోవాలి.
మన జీవిత భాగస్వామిని మన మాటలతో కృంగదీయకుండా, ప్రేమతో నిలబెట్టడానికి ప్రయత్నించాలి.
మన కుటుంబాలలో ప్రేమ, క్షమాపణ, ఓర్పు, త్యాగం ఉండాలి. మనం చేసిన మేలును గొప్పగా చెప్పుకోవడం కాకుండా, ఇతరులు మనకు చేసిన మేలును గుర్తుంచుకోవాలి.
క్రీస్తు ప్రేమ కుటుంబాలలో కనిపించాలి.
ఎఫెసీయులకు 4:2–3 | కొలొస్సయులకు 3:13 | 1 కొరింథీయులకు 13:4–7
నా జీవిత సాక్ష్యం — భాగం 26
చివరిగా నా హృదయంలో ఉన్న కృతజ్ఞత
మూడు సంవత్సరాలు కష్టాలతో ప్రార్థించిన నాకు జీవిత భాగస్వామిని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు.
అమ్మగారు వెళ్లిపోయిన తరువాత కూడా నా జీవితంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పిస్తున్న దేవునికి కృతజ్ఞతలు.
నా అమ్మగారిని కన్నకూతురిలా చూసుకున్న నా భార్యకు కృతజ్ఞతలు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మా కుటుంబాన్ని ప్రేమతో చూసుకునే హృదయాన్ని అనుగ్రహించినందుకు ప్రార్థిస్తున్నాను.
మా అమ్మగారి చివరి ప్రయాణంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
ఉద్యోగం వచ్చినప్పుడు కృతజ్ఞతలు. ఉద్యోగం లేకుండా నిరీక్షిస్తున్నప్పుడు కూడా దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉండేందుకు కృపను కోరుకుంటున్నాను.
నా జీవితంలో నేను పొందిన మేలును మరచిపోకుండా, కృతజ్ఞత కలిగిన హృదయంతో జీవించాలని కోరుకుంటున్నాను.
నా జీవితంలో నేను పొందిన ప్రతి మేలుకు మహిమ దేవునికే.
నా జీవిత సాక్ష్యం — భాగం 26-A
ప్రేమ మాటల్లో మాత్రమే కాదు
ప్రేమ అనేది మాటల్లో మాత్రమే కాదు.
- బాధ్యతలో కనిపించాలి.
- సహనంలో కనిపించాలి.
- త్యాగంలో కనిపించాలి.
- సేవలో కనిపించాలి.
- క్షమాపణలో కనిపించాలి.
- నిరీక్షణలో కనిపించాలి.
- కష్టకాలంలో ఒకరికి మరొకరు తోడుగా నిలబడటంలో కనిపించాలి.
పరిస్థితులు మారినా ప్రేమ మారకూడదు.
ఆర్థిక పరిస్థితులు మారినా విశ్వాసం మారకూడదు.
ఉద్యోగం ఉన్నా లేకపోయినా మన జీవితాలలో క్రీస్తు స్వభావం కనిపించాలి.
మనలో ఉన్న పాత స్వభావం పూర్తిగా చనిపోవాలి. ప్రతి సందర్భంలో, ప్రతి మాటలో, ప్రతి పనిలో యేసుక్రీస్తు స్వభావం కనిపించాలి.
క్రీస్తు మాత్రమే మనలో కనిపించాలి — మన పాత స్వభావం పరిపూర్ణంగా చనిపోవాలి.
ఎఫెసీయులకు 5:25 | 1 కొరింథీయులకు 13:4–7 | ఎఫెసీయులకు 4:2–3 | కొలొస్సయులకు 3:13–14 | గలతీయులకు 6:2 | 1 థెస్సలొనీకయులకు 5:18 | కీర్తనలు 37:7 | కీర్తనలు 40:1 | రోమీయులకు 8:28–29 | ఫిలిప్పీయులకు 4:11–13 | యాకోబు 1:2–4 | ఆదికాండము 15:5–6 | ఆదికాండము 17:1–2
CHRIST MUST LIVE IN US • OUR SELF MUST DIE
మనలో క్రీస్తు జీవించాలి • మనం చనిపోవాలి.