CHRIST LIFE REVIVAL — నా జీవిత సాక్ష్యం
పోస్టర్ 1-H
2024 మే 1 — అమ్మగారి జ్ఞాపకార్థ కార్యక్రమం
2024 ఏప్రిల్ 22న మా అమ్మగారు ఈ లోకాన్ని విడిచిపోయిన తరువాత, మొదటి జ్ఞాపకార్థ రోజును 2024 మే 1న మా అమ్మగారి జ్ఞాపకార్థ కూడికను కూడా ఘనంగా జరుపుకున్నాము.
హౌస్ ఆఫ్ ప్రేయర్ నుండి మోసెస్ పాస్టర్, ప్రశాంత్ పాస్టర్, అల్ఫిన్ పాస్టర్ వచ్చి ప్రార్థనాపూర్వకంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఆ సందర్భంగా మా అన్నయ్య చేసిన సహాయాన్ని, అమ్మగారి పట్ల ఆయనకున్న ప్రేమను కూడా నేను కృతజ్ఞతతో నా హృదయంలో గుర్తుచేసుకుంటాను.
మా అన్నయ్యకి నేను అంటే ఎంతో ఇష్టం. కొన్ని కారణాల వల్ల కలిసే లేదు. క్రమేపీను రెండు పార్ట్లు కోరుకున్నాను.
అమ్మ వెళ్లిపోయిన తరువాత — ఆమె అడిగిన ప్రశ్న ఎదురైంది
మా అమ్మగారు వెళ్లిపోయిన తరువాత నా జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఎన్నో సంవత్సరాలు నేను చూసుకున్న అమ్మ ఇక నా దగ్గర లేదు. ఆమెకు వచ్చే పెన్షన్ కూడా ఆగిపోయింది.
అప్పటివరకు అమ్మగారు నా గురించి ఆందోళనతో అడిగిన మాటలు గుర్తొచ్చాయి.
“నేను వెళ్లిపోయిన తరువాత నీ పరిస్థితి ఏమిటి?”
అమ్మగారు అడిగిన ఆ ప్రశ్నకి ఇప్పుడు నా జీవితమే సమాధానం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది.
నా భార్యతో కలిసి కుటుంబ బాధ్యతలను కొనసాగించాలి. ఉద్యోగం సంపాదించాలి. ఇంటి అవసరాలను తీర్చాలి. ఆర్థికంగా నిలబడాలి. కానీ పరిస్థితులు నేను అనుకున్నట్లు మారలేదు.
అమ్మగారి మరణంతో నా బాధ్యతలు ముగియలేదు. కొత్త పరిస్థితుల్లో కొత్త బాధ్యతలు ప్రారంభమయ్యాయి.
అయినా నేను ఒక విషయం గుర్తుంచుకున్నాను.
“మనకు దేవుడే దిక్కు.”
అని అమ్మతో కలిసి చెప్పుకున్న మాట.
ఇప్పుడు ఆ మాటను నా భార్యతో కలిసి జీవితంలో ఆచరించవలసిన సమయం వచ్చింది.
బైబిల్ వాక్య సూచనలు: కీర్తనలు 37:5 | యెషయా 41:10 | ఫిలిప్పీయులకు 4:19 | 2 కొరింథీయులకు 12:9
పోస్టర్ 15
2024 జూన్–సెప్టెంబర్ — బహ్రెయిన్ ఉద్యోగం, మళ్లీ విరామం
2024 జూన్ 22 నుండి సెప్టెంబర్ 25 వరకు
Bahrain లో LTB-300 ప్రాజెక్ట్‌లో పనిచేశాను.
అమ్మగారు వెళ్లిపోయిన తరువాత కూడా నా ఉద్యోగ జీవితం స్థిరంగా లేదు. 2024 జూన్ 22 నుండి సెప్టెంబర్ 25 వరకు బహ్రెయిన్‌లో LTB-300 ప్రాజెక్ట్‌లో పనిచేశాను. ఆ తరువాత మళ్లీ ఉద్యోగ విరామం.
పోస్టర్ 16
2024 అక్టోబర్ 2 — మా మొదటి ఊటీ ప్రయాణం
మా అమ్మగారు మరణించిన తరువాత నేను Bahrain నుండి వచ్చిన తరువాత నా భార్యను ఊటీకి తీసుకెళ్లే అవకాశం దేవుడు నాకు అనుగ్రహించాడు.
వివాహానికి ముందు గోవా వెళ్లేద్దామని చెప్పిన నేను, మా అమ్మగారి సేవ కారణంగా ఎన్నో సంవత్సరాలు నా భార్యను అలా బయటకు తీసుకెళ్లలేకపోయాను.
మా అమ్మగారి మరణం తరువాత ఊటీకి వెళ్లడం మా మొదటి ప్రత్యేకమైన ప్రయాణం. అది ఇప్పటికీ అలాంటి మా మొదటి ఆనందం కూడా.
ఎందుకంటే నా సుదీర్ఘ ఆర్థిక పరిస్థితులు, నేను నడుపుతున్న జీవితం ప్రయాణం కారణంగా మళ్లీ అలాంటి అవకాశాలు కలగలేదు.
అయినా ఆ ఊటీ ప్రయాణం నా జీవితంలో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఎన్నో సంవత్సరాలు ఒప్పుకున్న నా భార్యతో కలిసి గడిపిన ఆ సమయం నాకు ఎంతో విలువైనది.
పోస్టర్ 17
2024 నవంబర్–2025 ఫిబ్రవరి — బస్రా ఆఫ్‌షోర్ ఉద్యోగం
2024 నవంబర్ 16 నుండి 2025 ఫిబ్రవరి 8 వరకు
Iraq లో Basra Oil Terminal వద్ద SAR Radio Officer గా పనిచేశాను.
2024 నవంబర్ 16 నుండి 2025 ఫిబ్రవరి 8 వరకు ఇరాక్‌లో బస్రా ఆయిల్ టెర్మినల్ వద్ద SAR Radio Officer గా పనిచేశాను. ఆ తరువాత మళ్లీ సుదీర్ఘ విరామం.
పోస్టర్ 18
2025 నవంబర్–2026 ఫిబ్రవరి — ఖతార్ ఉద్యోగం; తరువాత నిరీక్షణ
2025 నవంబర్ 11 నుండి 2026 ఫిబ్రవరి 12 వరకు
Qatar లో MAG MAINTAINER I ప్రాజెక్ట్‌లో Radio/Admin బాధ్యతలు నిర్వహించాను.
2025 నవంబర్ 11 నుండి 2026 ఫిబ్రవరి 12 వరకు ఖతార్‌లో MAG MAINTAINER I ప్రాజెక్ట్‌లో Radio/Admin బాధ్యతలు నిర్వహించాను. ఆ తరువాత మళ్లీ ఉద్యోగం కోసం నిరీక్షణ.
అక్టోబర్ 29 వతేదీ వరకు ఉద్యోగం లేదు ఇంకా నిరీక్షణలోనే ఉన్నాను.
బైబిల్ వాక్య సూచనలు: కీర్తనలు 37:5 | యెషయా 40:31 | ఫిలిప్పీయులకు 4:13 | 2 కొరింథీయులకు 12:9
CHRIST MUST LIVE IN US • OUR SELF MUST DIE
మనలో క్రీస్తు జీవించాలి • మనం చనిపోవాలి.