CHRIST LIFE REVIVAL
నా జీవిత సాక్ష్యం — భాగం 23-B
దేవుని సన్నిధిలో నిరీక్షణతో నా ప్రార్థన
1. దేవుడు మనసును పరిశీలిస్తాడు.
దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడి మనలను చూస్తాడు. నేను చెప్పేదే కరెక్ట్ అనుకుంటున్నానా? తగ్గించుకొని లేఖనాలు పరిశీలించి, సరిపోలితే స్వీకరిస్తాడా? అని చూస్తాడు.
దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి.
2. దేవునిని నిందించకూడదు.
నా పరిస్థితులలో దేవునిని నిందించకుండా ఉండటం ఎలానో నేర్చుకోవడానికి ప్రయత్నించాను.
నా బాధలో ఆయనను దూషించకుండా ఉండాలని కోరుకున్నాను.
3. నా ప్రార్థన.
“ప్రభువా! ఈ పరిస్థితిని భరించడానికి నాకు కృపను అనుగ్రహించుము.”
అని ప్రార్థిస్తూ, దేవుని కృపతో ప్రతి పరిస్థితిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో కొనసాగుతున్నాను.
4. ఆత్మీయ ఆదరణ.
నా జీవితంలో నేను అనుభవించిన ఆత్మీయ ఆదరణ:
“నీ జీవితంలోని పరిస్థితులు నాకు తెలియనివి కావు. నీవు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న పోరాటాలు నాకు తెలుసు. నీవు కోరుకున్న క్రీస్తు స్వరూపంలో ఎదగడానికి ప్రతి పరిస్థితిలో ఎలా ఉండాలో నేర్చుకుంటూ ముందుకు కొనసాగుతున్నావు. నీవు నన్ను విడిచిపెట్టకుండా, నేను ఇచ్చిన వాగ్దానం కోసం నిరీక్షిస్తున్నావు.”
ఈ భావనలు నా ప్రార్థనా జీవితంలో నాకు ధైర్యాన్నిచ్చాయి.
వాక్య సూచనలు: రోమీయులకు 12:2 | ఫిలిప్పీయులకు 2:3 | యాకోబు 1:5 | 2 కొరింథీయులకు 12:9
CHRIST MUST LIVE IN US • OUR SELF MUST DIE
మనలో క్రీస్తు జీవించాలి • మనం చనిపోవాలి.