CHRIST LIFE REVIVAL — నా జీవిత సాక్ష్యం మూడు సంవత్సరాల కన్నీటి ప్రార్థన — వివాహానికి ముందు నా పరిస్థితి
నా జీవితంలో వివాహం అనేది అంత సులభంగా జరిగిన విషయం కాదు.
మా అమ్మగారిని చూసుకునే బాధ్యత నా ఉద్యోగ జీవితాన్నే కాకుండా నా వివాహ జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది.
నాకు వచ్చిన కొన్ని వివాహ సంబంధాల్లో నా ఉద్యోగం కావాలి కానీ వృద్ధురాలైన మా అమ్మగారి బాధ్యతను అంగీకరించడానికి ఇష్టపడని పరిస్థితులు ఎదురయ్యాయి.
ఆ సమయంలో నా హృదయంలో ఎంత బాధ ఉండేదో నా సృష్టికర్తకు మాత్రమే తెలుసు.
మంచి జీవిత భాగస్వామి కోసం మూడు సంవత్సరాలు కన్నీటితో దేవునికి ప్రార్థించాను.
పెళ్లికి ముందు పక్కింట్లో ఎవరైనా మాంసాహారం వండుతున్నప్పుడు కూడా నా కళ్లలో నుంచి నీళ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఆ సమయంలో ఆకాశం వైపు చూసి ప్రార్థించేవాడిని.
“అయ్యా! నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రీ!”
ఆ మాటల్లో ఎంత బాధ ఉందో, ఆ కన్నీళ్ల వెనుక ఎంత వేదన ఉందో నన్ను సృష్టించిన నా సృష్టికర్తకు మాత్రమే తెలుసు.
ఆ బాధలోనే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ జీవించాను.
పోస్టర్లోని బైబిల్ వాక్య సూచనలు: యాకోబు 1:3–4 | రోమీయులకు 5:3–4
పోస్టర్ 1-A — నన్నే వివాహం చేసుకుంటానని నిర్ణయించుకున్న నా భార్య
నా భార్య నన్ను వివాహం చేసుకునే క్రమంలో కూడా కొన్ని పోరాటాలు ఎదురయ్యాయి.
కొన్ని సంఘటనల కారణంగా నన్ను వద్దనుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.
అయినా నా భార్య తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
ఆమె మాటలు:
“పెళ్లి చేసుకుంటే అతనినే చేసుకుంటాను. లేకపోతే ఇలాగే అసలు పెళ్లి లేకుండా [Nun గా] ఉండిపోతాను.”
అని చెప్పింది.
ఆమె తీసుకున్న ఆ నిర్ణయం వల్ల మా వివాహం జరిగింది.
ఇక్కడ నేను దేవుని బలమైన సంకల్పాన్ని చూశాను.
నన్ను వద్దనుకునే పరిస్థితులు ఎదురైనా, నన్ను జీవిత భాగస్వామిగా కోరుకున్న వ్యక్తిని దేవుడు నా జీవితంలోకి తీసుకువచ్చాడని నమ్ముతున్నాను.
ఇది నా జీవితంలో ఒక మరచిపోలేని మధుర జ్ఞాపకం.
“నన్ను ఇంతగా ప్రేమించేవారు కూడా ఉన్నారా?”
అని ఆశ్చర్యపోయిన సందర్భం అది!
మూడు సంవత్సరాలు కన్నీటితో ప్రార్థించిన నాకు దేవుడు ఇచ్చిన సమాధానంగా నా భార్యను భావిస్తున్నాను.
“నువ్వు వేసుకున్న బట్టలతో మాత్రమే నా ఇంటికి రావాలి. అంతకుమించి నీ నుంచి నేను ఏమీ ఆశించడం లేదు — మన జీవిత ప్రయాణం ముగిసేంతవరకు.”
ఆ మాట ప్రకారం, 2026 అక్టోబర్ 12 వరకు నేను ఆమె కుటుంబం నుంచి ఏమీ ఆశించలేదు, అడగలేదు. నా దేవుడు సమృద్ధిగలవాడు.
నేను తీసుకున్న ఆ తీర్మానాన్ని జాపకం చేసుకుంటూ, ఆయన నిర్దేశించి రూపుదిద్దిన మార్గంలో నన్ను ముందుకు నడిపిస్తున్నాడని నమ్ముతున్నాను.
CHRIST MUST LIVE IN US • OUR SELF MUST DIE
మనలో క్రీస్తు జీవించాలి • మనం చనిపోవాలి.