CHRIST LIFE REVIVAL
నా జీవిత సాక్ష్యం — భాగం 23-A
నలభై ఏడు సంవత్సరాల నా జీవితాన్ని తిరిగి చూసుకున్నప్పుడు
నా జీవితంలో గడిచిన నలభై ఏడు సంవత్సరాలను తలుచుకున్నప్పుడు ఎన్నో సంఘటనలు గుర్తుకొస్తాయి.
నాకు సాధారణమైన, సంతోషకరమైన జీవితం కూడా దక్కలేదని అనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
1. నా జీవిత ప్రయాణం
నా జీవితంలో తిరస్కరణలు, ఒంటరితనం, అవమానాలు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విరామాలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, నిరీక్షణ, ఇవన్నీ ఉన్నాయి.
2. దేవునిపై నిందించలేదు
ఈ రోజు వరకు నా పరిస్థితుల కారణంగా దేవుణ్ణి నిందించలేదు.
ఆయనను దూషించలేదు.
ప్రశ్నిస్తూ తిరుగుబాటు చేయలేదు.
నా ప్రార్థనలో ఇలా చెప్పుకునేవాడిని:
“నీవు నన్ను ఆశీర్వదించినా, ఆశీర్వదించకపోయినా నీవు దేవుడవే.”
“నా పరిస్థితులను బట్టి నీవు మారవు కదా!”
“సంతోషకరమైన పరిస్థితుల్లో నిన్ను అంగీకరించిన నేను, కష్టాల్లో కూడా నిన్ను అంగీకరించాలి కదా!”
“నీవు మారవు; మారవలసింది నేనే.”
“తండ్రీ, నేను బలహీనుడిని; నీవు బలవంతుడవు!”
“నేను నా పరిస్థితులను నా బాలహీనతలను నా ఆంతట నేను జయించలేను తండ్రీ.”
"నేను నిన్ను పట్టుకొంటే నా పరిస్థితులని బట్టి నిన్ను వదిలేయవచ్చేమో అందుకే నీ చేతితో నన్ను గట్టిగా పట్టుకో తండ్రీ.”
3.అని నా ప్రతీ పరిస్తితిలో దేవునికి ప్రాధేయపడ్డాను
“సాగిలపడి, మోకాళ్లపై, నిలబడి, కూర్చొని, — అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, ప్రతికూలతల మధ్య కూడా దేవునికి ప్రాధేయపడ్డాను.”
నేను ఇప్పటికీ కూడా నేను కోరుకున్న అదే నడిపింపును చూస్తున్నాను.
బైబిల్ వాక్య సూచనలు: కీర్తనలు 37:5 | యెషయా 40:31 | విలాపవాక్యములు 3:22–23 | 2 కొరింథీయులకు 12:9
CHRIST MUST LIVE IN US • OUR SELF MUST DIE
మనలో క్రీస్తు జీవించాలి • మనం చనిపోవాలి.